ఐపీఎల్ చరిత్రలో ఫ్లాప్‌గా మారిన అత్యంత ఖరీదైన ఆటగాళ్లు..

10. వరుణ్ చక్రవర్తి (రూ. 8.4 కోట్లు, KXIP, 2019) కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చక్రవర్తిపై రూ. 8.4 కోట్లు వెచ్చించింది. అయితే అతను ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందులో ఒక వికెట్ తీసి ఓవర్‌కి 12 పరుగులు ఇచ్చాడు.

9. ఇర్ఫాన్ పఠాన్ (రూ. 8.5 కోట్లు, ఢిల్లీ, 2011) రూ. 8.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున 11 వికెట్లు పడగొట్టి 151 పరుగులు మాత్రమే చేశాడు.

8. పవన్ నేగి (రూ. 8.5 కోట్లు, ఢిల్లీ, 2016) ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2016లో రూ. 8.5 కోట్లకు నేగీని కొనుగోలు చేసింది. అయితే అతను దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో 57 పరుగులు చేసి,  ఒక వికెట్ తీశాడు.

7. కెవిన్ పీటర్సన్ (రూ. 9.8 కోట్లు, RCB, 2009) పీటర్సన్ IPL 2009లో అత్యంత ఖరీదైన ఆటగాడు. RCB రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం 93 ​పరుగులు మాత్రమే చేశాడు

6. ఆండ్రూ ఫ్లింటాఫ్ (రూ. 9.8 కోట్లు, CSK, 2009) 2009లో ఫ్లింటాఫ్‌పై CSK రూ. 9.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను కేవలం మూడు గేమ్‌ల తర్వాత గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. బౌలింగ్ చేయడానికి ముందు, అతను 62 పరుగులు చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.

5. దినేష్ కార్తీక్ (రూ. 10.5 కోట్లు, RCB, 2015) కార్తీక్ 2015లో RCB రూ. 10.5 కోట్లకు సంతకం చేసిన తర్వాత, కీపర్-బ్యాటర్ 14 గేమ్‌లలో 141 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

4. రాబిన్ ఉతప్ప (రూ. 10.9 కోట్లు, PWI, 2011) ఉతప్ప 2011లో పూణే వారియర్స్‌లో భాగంగా ఉన్నాడు. అయితే అతను 14 మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి 264 పరుగులు మాత్రమే వచ్చాయి.

3. జయదేవ్ ఉనద్కత్ (రూ. 10.5 కోట్లు, RR, 2018) 2018లో ఉనద్కత్ భారీ ధర అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను 15 ప్రదర్శనలలో 11 మందిని మాత్రమే పెవిలియన్ చేర్చాడు.

2. టైమల్ మిల్స్ (రూ. 12 కోట్లు, RCB, 2017) RCB 2017లో ఇంగ్లండ్ పేసర్ కోసం రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. అయితే అతను ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టి విఫలమయ్యాడు.

1. యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు, DD, 2015) ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువరాజ్ సింగ్‌ను రూ. 16 కోట్లకు దక్కించుకున్నారు. 14 మ్యాచ్‌ల్లో 248 పరుగులు మాత్రమే చేయగలిగాడు.