శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ..?
03 september 2023
Pic Credit - Instagram
ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీదేవి విజయ్ కుమార్. తన అందం అభినయంతో కట్టిపడేసింది.
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురే ఈ ముద్దుగుమ్మ. శ్రీ దేవి విజయ్ కుమార్ తెలుగులో పలు సినిమాల్లో నటించి అలరించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు
దూరం అయ్యింది.
వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్ ఈమెకు సోదరి. అలాగే నటుడు అరుణ్ విజయ్ శ్రీదేవి తమ్ముడు.
ప్రస్తుతం శ్రీదేవి విజయ్ కుమార్ పలు టీవీ షోల్లో కనిపిస్తున్నారు. తరగని అందంతో ఇప్పటికే యంగ్ హీరోయిన్ లా ఉన్నారు శ్రీదేవి.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా శ్రీదేవి షేర్ చేసిన ప్రొఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో చందమామలా ఉంది ఈ చిన్నది.
శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టాలని, ఆమె తిరిగి సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి శ్రీదేవి రీఎంట్రీ ఇస్
తారేమో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి