19 January 2024

కోలీవుడ్‌లోకి  సీతారామం బ్యూటీ..?

TV9 Telugu

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది.

అక్కడ జర్సీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి పరిచయం అయ్యింది.

అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది ఈ వయ్యారి భామ. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమా ఆఫర్స్ కూడా ఈ భామ చేతిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు మృణాల్ కు తమిళ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయ్యాయి.

దాంతో మృణాల్ కు ఇప్పుడు తమిళ్ నుంచి కూడా క్రీజీ ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. ఓ యంగ్ హీరో సినిమాలో నటించనుందని టాక్.