ఆ హీరోయిన్ కారణంగానే విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు దూరమయ్యాడా?
TV9 Telugu
30 July 2024
గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్
ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు
ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి మెకానిక్ రాకీ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ ముల్లపూడి దర్శకుడు.
సినిమాల సంగతి పక్కన పెడితే.. విశ్వక్‍సేన్ కొన్ని వారాల క్రితం తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్నారు.
అయితే ఓ హీరోయిన్ వల్లే అతను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశాడని రూమర్లు విపరీతంగా వచ్చాయి.
ఈ విషయంపై మెకానిక్ రాకీ ఈవెంట్‍లో విశ్వక్‍సేన్‍కు ఒక ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. దీనికి తన స్టైల్‍లో ఆన్సర్ చెప్పాడు మాస్ కా దాస్.
'నువ్వు అమ్మాయిల కోసం ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటావు. నేను అభిమానుల కోసం ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటాను' అంటూ కౌంటర్ ఇచ్చాడు విశ్వక్.
అలాగే కొందరు వేరే పనులు చేసేందుకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటారని, తాను మాత్రం ఫ్యాన్స్ కోసమే ఉంటానని ధీటుగా బదులిచ్చాడీ యంగ్ హీరో.
ఇక్కడ క్లిక్ చేయండి..