14 September 2023

కత్రినాతో ప్రేమ చాలా కష్టమనిపించింది.. విక్కీకౌశల్ కామెంట్స్.. 

Pic credit - Instagram

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య కత్రినా కైఫ్ తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

కత్రినాకైఫ్‌తో వివాహం తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఆమె రాకతో తన జీవితం పరిపూర్ణమైందని.. ఎన్నో విషయాల్లో తనను ఆమె గైడ్ చేస్తుందన్నారు.

స్టార్ హీరోయిన్ అనే హోదా చూసి ఆమెను ప్రేమించలేదని.. కేవలం కత్రినా మంచి మనసు తెలుసుకున్నాక మాత్రమే ఆమెను ఇష్టపడడం స్టార్ట్ చేశారనని అన్నారు. 

రోజులు గడిచే కొద్దీ ఆమెపై ప్రేమ పెరిగిందని.. ఆ సమయంలోనే ఆమె అటెన్షన్ పొందడం చాలా కష్టమని అనిపించింది చెప్పుకొచ్చారు విక్కీ కౌశల్. 

అలాంటి సమయంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కత్రినా.. తన గురించి మాట్లాడారని.. ఆ విషయం తెలిసి చాలా ఆనందించానని అన్నారు విక్కీ. 

కత్రినా నిజంగానే నా గురించి మాట్లాడారా ?.. అని ఆశ్చర్యపోయాను. కొంతకాలానికి ఆమెతో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరం ప్రేమలో పడ్డామని అన్నారు. 

తమ ప్రేమ విషయాన్ని మొదట తన కుటుంబసభ్యులకు చెప్పానని .. ఆ తర్వాత కత్రినా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇరువురి పెద్దల అంగీకారంతో తమ వివాహం జరిగిందన్నారు. 

 పిల్లల విషయంలో ప్రస్తుతానికి మా వాళ్లు ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదని అన్నారు విక్కీ కౌశల్. వీరిద్దరి వివాహం 2021 డిసెంబర్ 9న జరిగింది.