TV9 Telugu
రష్మికతో ప్రేమ, పెళ్లి.. విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చాడా?
29 March 2024
గతేడాది సమంతతో కలిసి ఖుషి సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవర కొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా వస్తున్నాడు.
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
గతంలో విజయ్ దేవరకొండతోనే కలిసి గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటోన్న విజయ్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ప్రేమ వివాహం చేసుకుంటానని, తనకు పిల్లలు కావాలంటూ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
అయితే ఈ ఏడాది తాను పెళ్లి చేసుకోనన్న విజయ్ లవ్ మ్యారేజ్ మాత్రం కచ్చితంగా చేసుకుంటానని కుండ బద్దలు కొట్టాడు.
దీంతో రష్మికతో డేటింగ్ పై విజయ్ దేవరకొండ మరోసారి హింట్ ఇచ్చాడని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..