వయ్యారాల వర్ష బొల్లమ్మ.. లేటెస్ట్ ఫొటోస్ 

04 December 2023

వర్ష బొల్లమ్మ.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. 

విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది . 

2015లో సుతరన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. తమిళ్ , మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేసింది ఈ భామ.

విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది, చేసింది చిన్న పాత్రే అయినా బాగానే ఆకట్టుకుంది. 

2020లో వచ్చిన చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అదే ఏడాది జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో నటించి మెప్పించింది. 

చివరిగా స్టాండప్‌ రాహుల్‌, స్వాతి ముత్యం సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఊరి పేరు భైరవకోన అనే సినిమాలో నటిస్తుంది. 

ఎలాంటి  గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లు ఎంచుకొని నటిస్తుంది వర్ష

 ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్యూట్ క్యూట్ ఫొటోలతో అభిమానులను ఆకర్షిస్తుంది వర్ష. 

తాజాగా ఈ క్యూటీ బ్యూటీఫుల్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందం అభినయం కలబోసిన వర్ష ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.