23 November 2023

సిద్ధు జొన్నలగడ్డ జోడిగా బేబీ బ్యూటీ.. వైష్ణవికి క్రేజీ ఛాన్స్.. 

Pic credit - Instagram

వైష్ణవి చైతన్య... కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చాలా ఫేమస్. కానీ ఇప్పుడు తెలుగు అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. 

సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్‏తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వైష్ణవి ఇప్పుడు వెండితెరపై సక్సెస్ ఫుల్ హీరోయిన్‏గా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా మారిపోయింది. 

 అందుకు కారణం బేబీ చిత్రం. డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమకథలో వైష్ణవి కథానాయికగా నటించగా.. ఆనంద్, విరాజ్ హీరోలుగా కనిపించారు. 

ఈ సినిమాలో వైష్ణవి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. స్క్రీన్ పై చూసిన ఒక పాత్రను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటే వైష్ణవి ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందో తెలుస్తోంది. 

బేబీ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో వైష్ణవి తెలుగులో వరుస క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం  ఈ బ్యూటీ డిజే టిల్లు సరసన నటిస్తుంది.

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది. 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

బేబీ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ జోడిగా వైష్ణవి కనిపిస్తుండడంతో ఈ మూవీపై క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.