04 January 2024

సిద్ధూ జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరింది

TV9 Telugu

Pic credit - Instagram

బేబీ సినిమాతో హీరోయిన్‏గా వెండితెరకు పరిచయమైంది వైష్ణవి చైతన్య. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది వైష్ణవి. దీంతో ఫాలోయింగ్ పెరిగింది.

బేబీ తర్వాత వైష్ణవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన నటిస్తుంది. తాజాగా క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన ఛాన్స్ పట్టేసింది. తాజాగా  ఈ సినిమా నుంచి చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

జనవరి 4న వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి కాంబోలో రాబోతున్న మూవీ నుంచి చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

తాజాగా విడుదలైన పోస్టర్‏ చూస్తుంటే ఈ సినిమాలో వైష్ణవి ముస్లిం అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ డ్రెస్‏లో తన లుక్ అదిరింది. 

ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ నుంచి షేర్ చేసిన వైష్ణవి లుక్ ఆకట్టుకుంటుంది. మరోసారి ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించనున్నట్లు తెలుస్తోంది.