02 September 2023
రూ.3.45 లక్షల చీరలో అందాల వాణి కపూర్. ఫోటోస్ వైరల్..
Pic credit - Instagram
వాణీ కపూర్.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయం తక్కువే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
తెలుగులో ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో గుర్తింపు గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం ఈ ముద్దగుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్లో ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ చీరకట్టులో అందంగా ముస్తబయ్యింది. ఓ అవార్డ్ వేడుక కోసం వాణి కపూర్ ఇలా చీరలో హజరయ్యింది.
అయితే వాణి కట్టిన డూపియన్ ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ చీర ధర రూ. 3,45,000 ఉన్నట్లు తెలుస్తోంది. ధర తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్.
వాణి కపూర్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
గతంలోనూ పలు ఈవెంట్లకు, సినిమా ప్రమోషన్లకు వాణి కపూర్ సంప్రదాయ లుక్ లో హజరై స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
వాణీ కపూర్ చివరిసారిగా షంషేరా చిత్రంలో నటించింది. ఇందులో సోనా పాత్రలో కనిపించి అలరించింది ఈ బాలవుడు హీరోయిన్.
ఇక్కడ క్లిక్ చేయండి.