ఎన్టీఆర్‌పై ప్రశంసలు.. దేవరలో ఛాన్స్ కొట్టేసిందా?

TV9 Telugu

16 April 2024

ఊర్వశి రౌతెలా.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లోనే ఈ అమ్మడి పేరు బాగా వినిపిస్తోంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార.

అయితే సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తలు నిలుస్తోందీఅమ్మడి. తన విచిచిత్రమైన కామెంట్లు, చేష్టలతో న్యూస్ లో ఉంటోంది.

ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఫొటో దిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఊర్వశి రౌతెలా.

అంతేకాదు ‘ఎన్టీఆర్‌గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం' అంటూ ప్రశంసలు కురిపించింది.

అలాగే  'సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని సోషల్ మీడియాలో తెగ పొగిడేసింది.

దీంతో ఈ అమ్మడికి ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవరలో ఏమైనా చాన్స్ వచ్చిందా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక మలయాళ బ్యూటీ కూడా ఉంది. దీంతో ఊర్వశి స్పెషల్ సాంగ్ లో ఏమైనా నటిస్తుందా? అని ఆలోచిస్తున్నారు.