'గురూజీ' జీవిత సత్యాలు.. త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ డైలాగ్స్..
Pic credit - Instagram
బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం.. బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అనవసరం.
కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేపనప్పుడు ఎంత సంపాదించినా.. పొగొట్టుకున్న తేడా ఉండదు.
నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.
కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం... బాధ్యత లేని యవ్వనం...జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం. వినే టైమ్, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది.
వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు...ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ప్రెండ్స్ కాలేరు.
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది.
గుడిలో దేవుడిని, కన్న తల్లితండ్రులను మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం. తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.