లియో కాంబో రిపీట్.. మళ్లీ విజయ్‌తో జత కట్టనున్న త్రిష..

TV9 Telugu

15 March 2024

త్రిష సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు పుష్కరకాలమైంది. అయినా ఆమె అందంలో కానీ, క్రేజ్‌ లో కానీ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికీ చిరంజీవి, కమల్ హాసన్, అజిత్ రజనీకాంత్, దళపతి విజయ్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా చేస్తోందీ చెన్నై సొగసరి.

ఇదిలా ఉంటే దళపతి విజయ్ తో కలిసి త్రిష నటించిన లియో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా గోట్ లో కీలక పాత్రకు త్రిష ఎంపికైందని సమాచారం.

ఇందులో మొదట అనుష్కను తీసుకోవాలనకున్నారు మేకర్స్. అయితే ఎందుకోగానీ స్వీటీ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

దీంతో దర్శక నిర్మాతలు త్రిషను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇది హీరోయిన్ రోలేనా? కాదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

జయ-త్రిషలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరద్దరి కాంబోలో ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియో వంటి హిట్ సినిమాలు వచ్చాయి.

ఇక త్రిష ప్రస్తుతం చిరంజీవితో కలిసి విశ్వంభర, అజిత్ విడాముయర్చి,  కమలహాసన్  థగ్స్‌ లైఫ్‌ తదితర సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.