08 November 2023

సౌత్ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ ఈ అమ్మాడికే సొంతం.. త్రిష తగ్గేదే లే.. 

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ త్రిష. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో క్రేజ్ మారింది. 

దీంతో ఇప్పుడు త్రిషకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతల ఫస్ట్ ఛాయిస్ త్రిష అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది. 

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా చేతి నిండా సినిమాలతో ఉండడం కేవలం త్రిషకే సాధ్యమయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్.

ఇటీవలే విజయ్ దళపతి సరసన లియో సినిమాతో అలరించింది త్రిష. డైరెక్టర్ లోకేష్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది.  

ఇక ప్రస్తుతం అజిత్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీ భాగమయ్యింది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

అలాగే తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమాలో త్రిషకు ఆఫర్ వచ్చింది.

థగ్ లైఫ్ అని టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవి కీలకపాత్రలు పోషిస్తున్నట్లు ఇదివరు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

 అలాగే తెలుగులోనూ త్రిషకు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే త్రిష తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.