02 November 2023
నన్ను బతికించినందుకు లోకేశ్‌కు ధన్యావాదాలు.. త్రిష కామెంట్స్..
Pic credit - Instagram
ఇప్పుడు మళ్లీ ఫాంలో దూసుకుపోతుంది త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మళ్లీ మారిపోయింది. ఇప్పుడు బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది.
తాజాగా ఈ బ్యూటీ నటించిన లియో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో విజయ్ దళపతి జోడిగా దాదాపు 15 ఏళ్ల తర్వాత నటించింది త్రిష.
ఈ సినిమా సక్సెస్ మీట్ చెన్నైలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న త్రిష.. దర్శకుడు లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపింది త్రిష.
త్రిష మాట్లాడుతూ.. నేను పనిచేసిన అత్యుత్తమ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. సత్య పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా ధన్యవాదాలు.
ఇక ఈ సినిమాలో నా పాత్రను చంపనందుకు లోకేశ్ కు స్పెషల్ థాంక్స్. దళపతితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది త్రిష.
విజయ్ తో మళ్లీ నటించడం చాలా కాలం తర్వాత స్కూల్లో స్నేహితుడిని చూసినట్లుగా అనిపించింది. 15 ఏళ్లుగా విజయ్‌తో ఎప్పుడు నటిస్తావని అడిగారు.
అప్పుడు ఎలా ఉన్నాడో..ఇప్పుడు అలాగే ఉన్నాడు విజయ్. అతనిలో ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడూ స్పెషల్ గానే కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.
రెండేళ్ల క్రితం నాకు లేకేష్ కథ ఎలా చెప్పాడు.. ఇప్పుడు లియో సినిమాను అలాగే తెరకెక్కించారు. ఈ సినిమాను హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.