ఆ సమయంలో నా గుండె బద్ధలైంది: తృప్తి దిమ్రి

TV9 Telugu

16 March 2024

రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ యాక్ట్రెస్ లిస్టులో చేరిపోయింది బాలీవుడ్ అందాల తార తృప్తి దిమ్రీ. 

సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తృప్తి నటన, అందాన్ని చూసి ఏకంగా నేషనల్ క్రష్ అని ట్యాగ్ ఇచ్చేశారు ఫ్యాన్స్.

యానిమల్ సినిమా క్రేజ్ తో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

టాలీవుడ్ లోనూ పలు ఛాన్సులు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు టాక్.

 అయితే ఈ సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదంటోంది తృప్తి దిమ్రీ. ఈ క్రేజ్ వెనక ఎన్నో కష్టాలున్నాయంటోంది.

కాగా కెరీర్ ఆరంభంలో తృప్తి పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది తృప్తి. అయితే ఏవీ సక్సెస్ కాలేదు.

అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో తృప్తి దిమ్రీ అడుగుపెట్టి సుమారు పదేళ్లకు పైగానే అవుతుందట. 

 ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా సినిమాలు నిరాశను మిగిల్చాయని, ఆ సయమంలో తన గుండె బద్ధలైందని చెబుతోందీ అందాల తార.