స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్.
2022లో చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గాస్క్వేర్ సినిమా తెరకెక్కింది.
ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న టిల్లు స్క్వేర్ మార్చి 29న శుక్రవారం థియేటర్లలోకి రిలీజైంది. కలెక్షన్ల పరంగా మొదటి రోజే బీభత్సం సృష్టించింది.
టిల్లు స్క్వేర్ సినిమా తొలి రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన పాన్ ఇండియా మూవీ హనుమాన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ టిల్లు స్క్వేర్ సినిమా రాబట్టి నట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లోనూ తొలి రోజు రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది టిల్లు స్క్వేర్ . ముఖ్యంగా నార్త్ అమెరికాలో సుమారుగా 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.
ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అలియాస్ రాధిక కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది ఆఖరిలో.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని టిల్లు స్క్వేర్ నిర్మించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.