బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా బిగ్ బాస్ లిస్ట్ వచ్చేసింది.
ఈసారి కూడా బిగ్ బాస్ 7కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్ లోకి పంపించారు.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్న ఆడవాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది నటి షకీలా. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి షకీలా ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రిథిక. ఈ అమ్మడు బిగ్ బాస్ స్టేజ్ పై చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది.
ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ దామిని కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న దామిని ఇప్పుడు బిగ్ బాస్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
టీవీ నటి శుభశ్రీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా సందడి చేస్తుందో చూడాలి.
టీవీ నటి శోభా శెట్టి కూడా ఈసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయ్యింది. ప్రియాంక జైన్ కూడా బిగ్ బాస్ లోకి వచ్చింది
నటి కిరణ్ రాథోడ్ అందరికి గుర్తుండే ఉంటుంది. పలు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ తో సందడి చేస్తుంది.