29 September 2023

సౌత్ మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా.. 

Pic credit - Instagram

దాదాపు 18 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

ఇటీవలే భోళా శంకర్, జైలర్ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇందులో జైలర్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. 

తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ గడిపేస్తుంది తమన్నా. 

తాజాగా సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ కావాలనే ఆశతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని తెలిపింది.

అయితే కొన్ని సినిమాలను కావాలనే వదిలేసుకోవాల్సి వస్తోందని.. ఇందుకు కారణం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతే అని తమన్నా వ్యాఖ్యనించింది. 

సౌత్ సినిమాలు పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంటాయని.. సినిమా మొత్తం హీరోయిజమే ఉంటుందని.. హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని తెలిపింది. 

అందుకే ఇలాంటి సినిమాల్లో భాగం కాకూడదనే ఆలోచనతో చాలా సౌత్ మూవీస్ ఆఫర్స్ వదులుకుంటున్నానని తెలిపింది మిల్కీ బ్యూటీ తమన్నా. 

 ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కొద్ది కాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.