08 September 2023
దివ్యభారతి పాత్రలో తమన్నా.. సినిమా టైటిల్ ఏంటంటే..
Pic credit - Instagram
ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఓవైపు సినిమాలు చేస్తూనే అటు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా ఈ బ్యూటీ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అలనాటి హీరోయిన్ దివ్యభారతి బయోపిక్‌లో మిల్కీబ్యూటీ ఎంపికైనట్లు తెలుస్తోంది.
దివ్యభారతి మరణంపై మలయాళీ డైరెక్టర్ అరుణ్ గోపీ సినిమా చేస్తున్నారు. ఇందులో దిలీప్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.
ఈ సినిమాకు బాంద్రా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దివ్యభారతి కథను చూపించనుండగా.. ఆమె పాత్రలో మిల్కీబ్యూటీ కనిపించనుందని తెలుస్తోంది.
ఈ సినిమాను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దివ్యభారతి మరణం ఇప్పటికీ వీడని ఓ మిస్టరీ అన్ని సంగతి తెలిసిందే.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించింది తమన్నా. అలాగే హిందీలో పలు వెబ్ సిరీస్ చేసింది మిల్కీబ్యూటీ.
ఇక ఇప్పుడు దివ్యభారతి పాత్రలో తమన్నా మెప్పిస్తుందా ? అనేది చూడాలి. ఓవైపు వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది.
కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది తమన్నా. వీరిద్దరు కలిసి అనేక ఈవెంట్లలో కలిసి పాల్గొన్న వీడియోస్ వైరలయ్యాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.