తమన్నా సరికొత్త రికార్డ్.. తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.. 

11 October 2023

Pic credit - Instagram

మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఏంటో తెలుసుకుందామా. 

జపాన్ కాస్మాటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‏గా నియమించింది. భారతీయ మహిళలకు గర్వకారణం. 

దాదాపు 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా ఉన్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషంగా ఉందంటుంది. 

తమన్నా, షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహం చేస్తుందని షిసిడో భావిస్తుంది. 

ఇప్పటివరకు షిసిడో కాస్మోటిక్స్ కు భారతీయులు బ్రాండ్ అంబాసిడర్స్ గా లేరు. ఇప్పుడ తొలి భారతీయ రాయబారిగా తమన్నా నిలిచింది. 

ఇటీవలే భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో మెరిసింది తమన్నా. అలాగే అటు ఓటీటీలో పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది ఈబ్యూటీ. 

మరోవైపు కొన్నాళ్లుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో  ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. 

జపాన్‏లో షిసిడో కాస్మోటిక్ బ్రాండ్ కు తమన్నా మొదటి అంబాసిడర్. ఇప్పుడు అందంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమంటుంది తమన్నా.