నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ హీరోనే పిలుస్తా: టబు

TV9 Telugu

07 July 2024

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిందీ అందాల తార

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే హీరోయిన్లలో టబు కూడా ఒకరు. అలాగే సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గానూ నటిస్తోంది.

తాజాగా టబు ‘ఆరోఁ మే కహా దమ్‌ థా’ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోస్టార్ అజయ్ దేవ్ గణ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది టబు

'నాకు చిత్ర నిర్మాతలతో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నా తరపున మాట్లాడటానికి అజయ్‌ను పిలుస్తాను. ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటారు'

 'అయితే మేం ఎంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఒకరిని ప్రభావితం చేయడానికి అజయ్‌ ప్రయత్నించరు'

 'సినిమాల్లోకి రాకముందే అజయ్‌ నాకు తెలుసు. ఆయన పెండ్లయ్యాక కూడా మా స్నేహంలో ఎలాంటి మార్పూ రాలేదు' అని టబు చెప్పుకొచ్చింది.