24 January 2024

బ్రేక్ కావాలంటున్న టాలీవుడ్ బ్యూటీ.. చదువుపై శ్రీలీల ఫోకస్.. 

TV9 Telugu

Pic credit - Instagram

 ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల. గురూజీ దర్శకత్వంలో మహేష్ శ్రీలీల కలిసి నటించారు. 

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు అంతగా విజయాన్ని అందుకోవడం లేదు. 

 ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు కాస్త విరామమిచ్చి తన చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. శ్రీలీల వైద్య విద్యార్థిని అన్న సంగతి తెలిసిందే. 

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ చదువుకుంటుంది. అప్పుడప్పుడు షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఎగ్జామ్స్ రాస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. 

అయితే గత రెండేళ్లుగా వరుస షూటింగ్స్ తో చదువుపై అంతగా దృష్టి పెట్టలేకపోయిందట శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయట. 

అందుకే కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టాలని భావిస్తుందట. అలాగే కథల ఎంపికలోనూ అచితూచి వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చిందట. 

ప్రస్తుతం శ్రీలీల విజయ్ దేవరకొండ జోడిగా నటిస్తుంది. అయితే ఈ మూవీ నుంచి హీరోయిన్ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ శ్రీలీల స్పందించలేదు.