08 December 2023

మల్టీటాలెంటెడ్ అమ్మాయి శ్రీలీల.. బ్యూటీ టాలెంట్ గుర్తించట్లేదా ?.. 

Pic credit - Instagram

శ్రీలీల ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్. వరుస సినిమాలతో ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్‏గా క్షణం తిరిక లేకుండా గడిపేస్తుంది ఈ బ్యూటీ. 

పెళ్లి సందడి సినిమాతో మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత ధమాకా మూవీతో ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది. ఏడాదిలోనే అరడజను సినిమాలు అనౌన్స్ చేసింది. 

కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కేవలం భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేసింది శ్రీలీల. 

 అంతకు ముందు వచ్చిన స్కంద సినిమాలో శ్రీలీల పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కేవలం సాంగ్స్, డాన్స్ పరంగా మాత్రమే శ్రీలీల పరిమితమైనట్లుంది. 

ఇక ఇటీవల విడుదలైన ఆదికేశవ సినిమా సైతం డిజాస్టర్ అయ్యింది. ఇందులో శ్రీలీ పాత్రకు అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. 

ఇప్పుడు రాబోతున్న ఎక్స్‏ట్రా ఆర్డీనరి మ్యాన్ సినిమా సైతం కామెడీ ఎంటర్టైనర్. ఇందులోనూ శ్రీలీలక పాత్ర కొత్తగా ఏమి లేనట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. 

నిజానికి శ్రీలీల మల్టీటాలెంటెడ్. మంచి నటిగానే కాకుండా హీరోలకు సైతం గట్టి పోటీనిచ్చే బెస్ట్ డాన్స్. అలాగే స్కంద ఈవెంట్లో గాయనిగానూ మెప్పించింది. 

 ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ గుంటూరు కారం సినిమాపైనే ఉన్నాయి. ఈ మూవీలో ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటేనే  శ్రీలీలకు గుర్తింపు దక్కుతుంది.