13 October 2023

బాలకృష్ణను మొదటిసారి కలవగానే భయమేసింది.. శ్రీలీల .. 

Pic credit - Instagram

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలలో నటించారు. 

 దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రీలీల. 

బాలకృష్ణని మొదటిసారి చూడగానే భయమేసిందని.. కానీ ఆయనను కలిసి మాట్లాడగానే టెన్షన్ అంతా పోయిందని.. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని తెలిపింది. 

బాలకృష్ణకు అపార అనుభవం ఉందని.. సినిమాతోపాటు ఇతర రంగాలపై కూడా ఆయన ఎక్కువగా పరిజ్ఞానం ఉందని చెప్పుకొచ్చింది శ్రీలీల. 

 మెడిసన్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత అందులోని విషయాలపై బాలకృష్ణ లోతుగా విశ్లేషించేవారని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రీలీల. 

 కానీ వైద్య విద్యలోని విషయాలకు ఆయనకు ఎలా తెలిసాయని ఆశ్చర్యపోయేదాన్ని అని... షూటింగ్ లో ఎన్నో విషయాలు పంచుకున్నారని తెలిపింది. 

ఏ భావోద్వేగాన్ని ఎలా పలికించాలి ?.. ఏ సంభాషణ ఎలా చెప్పాలి?  అనే విషయాల నుంచి  ఇంకా కొన్ని విషాయాల్లో సలహాలు ఇచ్చారని తెలిపింది.