14 October 2023

ఆ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీలీల.. ఎంతంటే.. 

Pic credit - Instagram

కొన్ని రోజులుగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది శ్రీలీల. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషించింది. 

 అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఈ సినిమాతోపాటు.. ఇప్పుడు తెలుగులో శ్రీలీల ఏకంగా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు వైద్య విద్య చదువుతుంది శ్రీలీల. 

ఇక ఇప్పుడు దర్శకనిర్మాత దృష్టి మాత్రం శ్రీలీల పైనే పడింది. కచ్చితంగా ఆమెతో సినిమా చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

ఈ క్రమంలో తాజాగా శ్రీలీల రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుందట. మొదట్లో ఒక్క సినిమాకు రూ. కోటి తీసుకుందని టాక్ నడిచింది. 

  ఆ తర్వాత తన రెమ్యూనరేషన్ రెండు కోట్లకు పెంచేసిందని.. ఇక ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 

అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, రామ్ పోతినేని, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడమంటే మాములు విషయం కాదు. 

అందం, అభినయమే కాకుండా.. తన డ్యాన్స్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. హీరోలకు సైతం గట్టి పోటీనిచ్చే విధంగా శ్రీలీల డ్యాన్స్ తో అదరగొట్టేస్తుంది.