25 October 2023

శ్రీలీలకు క్యూ కట్టిన అవకాశాలు.. కానీ లక్ కలిసోస్తుందా ?.. 

Pic credit - Instagram

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. ఈ మూవీ తర్వాత సెకండ్ సినిమా ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ  ముద్దుగుమ్మ. 

 ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఏకంగా అరడజను పైగా చిత్రాలు అనౌన్స్ చేసింది. 

ఇటీవల స్కంద సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో శ్రీలీల ఖాతాలో ప్లాప్ చేరింది. 

తాజాగా బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రాగా.. కలెక్షన్స్ లోనూ దూసుకుపోతుంది. శ్రీలీలకు మంచి మార్కులే పడ్డాయి

మరోవైపు వైష్ణవ్ తేజ్ కి జోడిగా శ్రీలీల నటించిన ఆదికేశవ విడుదలకు సిద్ధమవుతుంది. కానీ సినిమాపై పెద్దగా బజ్ మాత్రం లేకపోవడంతో అంతగా అంచనాలు లేవు. 

ఇక నితిన్ కు జోడీగా ఎక్స్ ట్రార్డినరి మూవీ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడు శ్రీలీల ఈ మూవీపై మాత్రం ఫుల్ నమ్మకంతో ఉంది. 

అలాగే మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోనూ శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

 పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అనేది క్లారిటీ లేదు. శ్రీలీల నెక్ట్స్ సినిమాలపైనే ఫోకస్ ఉంది.