12 October 2023

క్యూట్ ఫొటోలతో కవ్విస్తోన్న  లేటెస్ట్ సెన్సషన్  శ్రీలీల..

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శ్రీలీల.తొలి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శ్రీలీలకు ఇప్పుడు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

శ్రీలీల నటించిన ధమాకా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీ కోసం కుర్రకారు మొత్తం ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం మహేష్ బాబు సరసన సినిమా చేస్తుంది శ్రీలీల. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాలో.. అలాగే బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది శ్రీలీల. 

ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలోనూ నటిస్తోంది. 

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది శ్రీలీల. 

తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ట్రెడిషనల్ లుక్ లో చాలా గ్లామరస్ గా ఉంది శ్రీలీల.