13 January 2024
బాబోయ్.. శ్రీలీలతో డాన్స్ అంటే కష్టమే అంటోన్న స్టార్స్..
TV9 Telugu
Pic credit - Instagram
శ్రీలీల.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. గతేడాది నాలుగైదు చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇక ఇప్పుడు సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో గుంటూరు కారం సినిమాతో మెప్పిస్తుంది. ఇందులో మరోసారి డాన్స్‌తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
మహేష్ బాబుతో కలిసి మాస్ స్టెప్పులతో రప్ఫాడించేసింది. ఈ మూవీలో శ్రీలీల డాన్స్ మరింత హైలెట్ అని చెప్పాలి. అంతగా తన డాన్స్‌తో వావ్ అనిపించుకుంది.
అయితే శ్రీలీలతో డాన్స్ అంటే కష్టమే అంటున్నాడు మహేష్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకలో స్వయంగా మహేష్ బాబు ఈ మాటలు చెప్పిన సంగతి తెలిసిందే.
గతేడాది నితిన్ సరసన నటించిన ఎక్స్ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమాలోనూ శ్రీలీల డాన్స్ స్పెషల్ హైలేట్ అయ్యింది. ఈ మూవీలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఆ తర్వాత యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో మరోసారి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో.. సినిమాకు స్పెషల్ హైలెట్ అయ్యింది శ్రీలీల.
2022లో రవితేజతో నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రవితేజ, శ్రీలీల డాన్స్ ఏరేంజ్ లో ఉందో అసలు చెప్పక్కర్లేదు.
ఇక ఇప్పుడు శ్రీలీల డాన్స్ గురించి ఏకంగా మహేష్ సైతం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ సైతం అదే స్థాయిలో ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.