31 October 2023
సాయి పల్లవితో శ్రీలీల లేడీ ఓరియేంటెడ్ సినిమా వస్తోందా ?..
Pic credit - Instagram
శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. పెళ్లి సందడి అంటూ వచ్చేసి.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఎంతలా అంటే.. ఒకే ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి రికార్డ్ సృష్టించింది.
ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో మరిన్ని ప్రాజెక్ట్స్ ఖాతాలో చేరాయి.
తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం శ్రీలీల, సాయి పల్లవి ఓకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్.
ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ కావడంతో.. అంతేకాకుండా.. ఇప్పటివరకు వీరు నటించిన సినిమాల్లో హీరోలను తమ డాన్సులతో డామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరితో కలిసి ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది ?. ఇద్దరిలో డాన్సింగ్ ట్యాలెంట్ పక్కగా ఎగ్జిక్యూట్ చేయగల్గితే సక్సెస్ అంటున్నారట.
వీరిద్దరితో లేడీ ఓరియేంటేడ్ సినిమా చేయాలని బడా ప్రొడ్యూసర్ ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ప్రస్తుతం శ్రీలీల ఆదికేశవ సినిమాలో నటిస్తుంది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.