షాకింగ్.. ఎవరూ ఊహించని యాడ్‌లో నటించిన శ్రీలీల
TV9 Telugu
19 August 2024
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల.
ఆ తర్వాత మాస్ మహరాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిందీ అందాల తార. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, శ్రీలీలకు క్రేజ్ రావడంతో టాలీవుడ్ దర్శక-నిర్మాతలందరూ ఒక్కసారిగా ఈ బ్యూటీ వెంట పడ్డారు.
ఆ తర్వాత స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తదితర సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.
అయితే ఇందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
సినిమాలతో పాటు ప్రకటనల్లోనూ నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీలీల తాజాగా మరో యాడ్ లో తళుక్కున మెరిసింది.
శాస్త్రి బామ్ అనే బ్రాండ్ కి శ్రీలీల యాడ్ చేసింది. దీనికి సంబంధించిన ప్రకటనను తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.
ఇందులో శ్రీలీల, ఇంకో అమ్మాయి నాట్యం చేస్తున్నట్టు, నాట్యం చేస్తుండగా పెయిన్ వస్తే శ్రీలీల ఆ బామ్ తెచ్చి ఇచ్చినట్టు యాడ్ ని చిత్రీకరించారు.
ఇక్కడ క్లిక్ చేయండి..