ఒక్క ఛాన్స్.. భగవంత్ కేసరితో తానేంటో నిరూపించుకున్న శ్రీలీల.. 

21 October 2023

Pic credit - Instagram

శ్రీలీల.. భగవంత్ కేసరికి ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తన పేరు  మారుమోగిపోతుంది. 

కొద్ది రోజుల క్రితం ఈ పేరు వింటే డాన్స్, నటన మాత్రమే గుర్తొచ్చేవి.. కానీ ఇప్పుడు అవే కాకుండా యాక్షన్ సైతం అదరగొట్టేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. 

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటనకు ప్రేక్షకులే ఫిదా అయ్యేలా చేసింది. 

అంతేకాదు.. ఇందులో బాలయ్యతో సమానంగా యాక్షన్ సీన్లతో అదరగొట్టేసింది. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్‏తో శ్రీలీల ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించింది. 

దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‏తో ఈ మూవీని తెరకెక్కించారు. 

అంతకుముందు స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాట పాడి గాయనిగానూ ఆకట్టుకుంది. అలాగే డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది శ్రీలీల. 

భగవంత్ కేసరి సినిమా క్లైమాక్స్  లో బాలయ్యతో కలిసి ఫైట్స్ సీన్స్ చేసింది. అందులో యాక్షన్ సీన్స్ అదరగొట్టేయడంతో అభిమానులే ఆశ్చర్యపోయేలా చేసింది. 

 శ్రీలీల టాలెంట్ చూసి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇక పై తెలుగులో కేవలం రొమాంటిక్ చిత్రాలే కాకుండా యాక్షన్ చిత్రాలు చేసే ఛాన్స్ లేకపోలేదు.