నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు : సునీత

17 November 2023

అందమైన గాత్రమే కాదు చూడచక్కని రూపం కూడా ఆమె సొంతం అనే సింగర్ సునీత. మనసుకు హత్తుకుని ఎన్నో పాటలను ఆలపించారు సునీత. 

తన గొంతుతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు సునీత. యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా రాణించి ప్రేక్షకులను మెప్పించారు సునీత. 

తాజాగా సింగర్ సునీత మాట్లాడుతూ.. తాం జీవితంలో జరిగిన విషయాల గురించి, తన అనుభవాల గురించి అభిమానులతో పంచుకున్నారు. 

17 ఏళ్లకే తన సినీ కేరీర్ మొదలైందని అన్నారు సునీత. అంత చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలను తీసుకున్నాను అన్నారు. 

వ్యాపారంలో నష్టాలూ రావడంతో తాము అన్ని కోల్పోయామని దాంతో తాను చిన్న వయసులోనే కెరీర్ మొదలు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు సునీత

అలాగే 19ఏళ్లకే వివాహం అయ్యిందని. దాంతో కెరీర్ తో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకునాను అని తెలిపారు. 

నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నా నవ్వు కూడా ఫేక్ అని కామెంట్స్ కూడా చేశారు అని తెలిపారు సునీత. 

నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా అడిగితే నవ్వి ఊరుకుంటాను. దాన్లో కొంతమందికే బాధ కనిపిస్తే మరికొంతమంది ఫేక్ స్మైల్ అని కామెంట్స్ చేశారు అని ఎమోషనల్ అయ్యారు సునీత.