నెట్టింట మృణాల్ డేటింగ్ గోల.. మొన్న పెళ్లి, ఇప్పుడు ప్రేమ..
ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మృణాల్ ప్రేమ, డేటింగ్ అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. బాలీవుడ్ సింగర్ బాద్ షాతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళీ పార్టీలో పాల్గొన్న మృణాల్.. అక్కడ శిల్పా, బాద్ షాలతో దిగిన ఫోటో షేర్ చేసతూ 'నాకు అత్యంత ఇష్టమైనవారు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో మృణాల్, బాద్ షా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట టాక్ నడిచింది. మృణాల్ తమ ఫోటోస్ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అయితే తమ గురించి వస్తున్న రూమర్స్ పై బాద్ షా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన ఇన్ స్టా వేదికగా మృణాల్ తో ప్రేమ, డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.
'డియర్ ఇంటర్నెట్.. నిన్ను మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు. ప్రస్తుతం మా గురించి వెలువడుతున్న వార్తలు ఏవీ నిజం కాదు' అంటూ ఫన్నీ ఎమోజీని షేర్ చేశాడు.
దీంతో మృణాల్, బాద్ షాల గురించి వస్తోన్న లవ్ అండ్ డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొన్నటి వరకు తెలుగు కుర్రాడితో మృణాల్ పెళ్లంటూ వార్తలు రాగా వాటిని ఖండించింది మృణాల్. మరి ఇప్పుడు వస్తోన్న డేటింగ్ రూమర్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.