13 October 2023
డిప్రెషన్ సమస్యకు టిప్స్ చెప్పిన శ్రుతిహాసన్.. అవెంటో తెలుసా ?..
Pic credit - Instagram
ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తోంది శ్రుతి హాసన్. ఈ మూవీలో ప్రభాస్ ససరన కనిపించనుంది. ఇప్పటికే ఆమ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
అటు హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది శ్రుతి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రుతి తాజాగా డిప్రెషన్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పంచుకుంది. ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని.. డిప్రెషన్ నుంచి బయటపడాలని చెప్పుకొచ్చింది.
మానసిక ఒత్తిడి గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదని.. తను మాత్రమే వాటి గురించి నిత్యం తన డైరీలో రాసుకుంటానని అన్నారు శ్రుతి హాసన్.
రోజూ జిమ్ చేయడం వల్ల శరీరంలోని రసాయనాలు, హార్మోన్స్ సమతుల్యం అవుతాయని. మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తుందని తెలిపింది.
రోజూ నచ్చినవారితో కాసేపు మాట్లాడతానని.. వారి మనసులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రుతి హాసన్.
సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకునే విషయాల్లో మంచి, చెడు గురించి ఆలోచిస్తానని.. వాటి గురించి విశ్లేషిస్తానని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.
ఇక ఇప్పుడు తెలుగులో కేవలం సలార్ చిత్రంలోనే నటిస్తోంది శ్రుతి హాసన్. అలాగే హాలీవుడ్ లో ది ఐ సినిమాలోనూ నటించింది. త్వరలోనే రెండు విడుదల కానున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.