హాలీవుడ్ సినిమాలో శ్రుతిహాసన్.. ఎంతో స్పెషల్ అంటోన్న బ్యూటీ..
06 October 2023
Pic credit - Instagram
సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకోవడానికి సిద్ధమయ్యింది శ్రుతి హాసన్. కానీ ఆలోపే ఈ బ్యూటీ పాన్ వరల్డ్ నటి అయ్యింది.
ప్రస్తుతం ఆమె నటించిన సలార్ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు
ఈ సినిమాతోపాటు న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న హాయ్ నాన్న సినిమాలోనూ శ్రుతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ రాలేదు.
అయితే ఇప్పుడు ఆమె నటిస్తోన్న హాలీవుడ్ చిత్రం ది ఐ. ఇప్పుడు ఈ సినిమానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు తన లైఫ్ లోనే బెస్ట్ అంటుంది శ్రుతి.
ఈ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డుల కేటగిరీల్లో నామినేట్ కావడం విశేషం. ది లాస్ట్ కింగ్ డమ్ సినిమా ఫేమ్ మార్క్ రౌలి హీరోగా నటించారు.
ఈ సినిమాలో కథానాయికగా నటించింది. పర్వాటక పరిరక్షణ ఇతివృత్తంతో రూపొందించిన ది ఐ చిత్రం లండన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది శ్రుతిహాసన్. అలాగే గ్రీక్ అంతర్జాతీయ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శించడమే కాకుండా అవార్డుల కేటగిరీలో నామినేట్ అయ్యింది.
అలాంటి సినిమాలో తాను నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా తన కెరీర్ లోనే ప్రత్యేకమని.. ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.