01 January 2024
Pic credit - Instagram
ఓరీ చేసిన పనికి తలపట్టుకున్న శ్రుతి.. దెబ్బకు బ్యూటీ రియాక్ట్..
TV9 Telugu
శ్రుతిహాసన్ ఈ ఏడాది వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
కానీ ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ప్రేమ, పెళ్లి విషయంలో రూమర్స్ వినిపిస్తుంటాయి.
గతంలో అనేకసార్లు శ్రుతిహాసన్ పెళ్లి గురించి నెట్టింట రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి.
సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రుతిహాసన్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శ్రుతిహసన్ భర్త తనతో మంచిగా ఉండడం వలన ఆమె తనను అపార్థం చేసుకుందేమో.. తనతో సరిగ్గా ప్రవర్తించలేదని.. తనకు బాధ కలిగిందని చెప్పాడు.
దీంతో మరోసారి శ్రుతిహాసన్ పెళ్లిపై వార్తలు తెరపైకి వచ్చాయి. తన ప్రియుడు శంతను హజారికను శ్రుతి రహస్యంగా పెళ్లి చేసుకుందనే టాక్ నడిచింది.
తాజాగా పెళ్లి రూమర్స్ పై స్పందించింది శ్రుతి. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. ప్రతి విషయాన్ని చెబుతాను.. అలాంటింది పెళ్లి ఎందుకు చెప్పాను పోస్ట్ చేసింది.
'నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతి విషయం మీతో పంచుకునే నేను పెళ్లి గురించి ఎందుకు దాస్తాను' అంటూ క్లారిటీ ఇవ్వడంతో శ్రుతి పెళ్లి వార్తలకు చెక్ పడింది.
Shruti Haasan
ఇక్కడ క్లిక్ చేయండి.