27 October 2023

నాన్న సలహాలు పాటించలేకపోతున్నాను..  శ్రుతి హాసన్.. 

Pic credit - Instagram

కమల్ హాసన్ తనయగా సినీరంగ ప్రవేశం చేసింది హీరోయిన్ శ్రుతి హాసన్. తొలి చిత్రానికే నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీని దాటి.. ఇప్పుడు హాలీవుడ్ స్తాయికి చేరుకుంది. సలార్ తప్ప ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమాకు కూడా లేదు. 

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో ఆద్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్ 22న అడియన్స్ ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ఓ భేటీలో పాల్గొన్న ఆమె.. నటుడు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ సినిమా గురించి  ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

ఈ సినిమాలో భాగమయినందుకు సంతోషంగా ఉందన్నారు. చిత్రయూనిట్ తనను తనలానే ఉండేలా షూటింగ్ ను అనుభవించేలా చేశారన్నారు  శ్రుతి హాసన్. 

ఇక హిందీ సినిమా డంకీ ఈ చిత్రానికి పోటీగా విడుదలవుతుండడం గురించి ఎలాంటి భయం లేదన్నారు. తమ సినిమాపై నమ్మకం ఉందని అభిప్రాయం తెలిపారు. 

ఇక తన తండ్రి సలహాలు తనకు ఆశ్చర్య కలిగిస్తాయని.. అయినప్పటికీ వాటిని తాను పాటించలేకపోతున్నానని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రుతి హాసన్. 

ప్రస్తుతం శ్రుతి హాసన్ చేతిలో  సలార్, హాలీవుడ్ ప్రాజెక్ట్ ది ఐ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతున్నాయి.