26 November 2023

'ఉప్పెన' ఆఫర్ అందుకే వదులుకున్నా.. శివానీ రాజశేఖర్ కామెంట్స్.. 

Pic credit - Instagram

శివానీ రాజశేఖర్.. ఇటీవలే కోటబొమ్మాళీ పీఎస్ సినిమాతో హిట్ అందుకుంది. సినీ ప్రయాణం మొదలుపెట్టి చాలా కాలమైన ఇప్పటికీ స్టార్‏డమ్ అందుకోలేకపోయింది. 

 ఇటీవల శ్రీకాంత్ నటించిన కోటబొమ్మాళీ పీఎస్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని విషయాలు పంచుకుంది. 

తనకంటూ కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయని శివానీ రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా ఉప్పెన సినిమా ఆఫర్ తనకు ముందే వచ్చిందని తెలిపింది. 

ఉప్పెన ఆఫర్ మొదట తనకే వచ్చిందని.. కానీ ఆ సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పింది. దీంతో ఆ సినిమాలో అంతగా నచ్చనిది ఏం ఉంది అంటూ శివానీని ప్రశ్నించాడు యాంకర్. 

తనకు వినిపించిన కథ డ్రాఫ్ట్ లో బోల్డ్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. వాటిని తాను సౌకర్యంగా చేయగలనని అనుకోలేదని చెప్పుకొచ్చింది శివానీ రాజశేఖర్.

 అయితే తనకు వినిపించిన స్క్రిప్ట్ వేరని.. ఆ తర్వాత తీసిన స్క్రిప్ట్ వేరని తెలిపింది. అప్పటికీ సౌకర్యంగా లేను.. ఇప్పుటికీ లిప్ లాక్స్, ఇంటిమసీ చేయగలగాలంటే నేను నేను అడగాలి అన్నారు. 

అంతేకాకుండా లవ్ మేకింగ్ సీన్స్, బోల్డ్ సీన్స్ చేయగలుగుతానో లేదో అని అన్నారు శివానీ. ఉప్పెన చిత్రంలో కృతిశెట్టి,  పంజా వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 

 డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక శివానీ 2 స్టేట్స్ సినిమాతో తన సినీ ప్రయాణం ఆరంభించింది.