సేవా మార్గంలోకి సంయుక్తా మేనన్.. కారణమిదే

TV9 Telugu

21 April 2024

భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది మలయాళ బ్యూటీ సంయుక్తా మేనన్.

అ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సార్ అనే సూపర్ హిట్ సినిమాలోనూ నటించిందీ అందాల తార.

అయితే ఆ తర్వాత కల్యాణ్ రామ్ తో కలిసి రెండో సారి నటించిన డెవిల్ సినిమా ఆమె వరుస విజయాలకు అడ్డుకట్ట వేసింది.

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ తో కలిసి స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది సంయుక్తా మేనన్.

సినిమాల సంగతి పక్కనబెడితే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా 'ఆదిశక్తి' పేరుతో హెల్పింగ్ ఫౌండేషన్ ప్రారంభించింది సంయుక్త.

విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం లాంటి విషయాల్లో మహిళలకు ఈ 'ఆదిశక్తి' ఫౌండేషన్ సంస్థ అండగా నిలబడనుందని తెలిపిందీ అందాల తార.

కాగా సంయుక్త ఉన్నట్లుండి ఇలా సేవా మార్గంలోకి అడుగు పెట్టడానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు

దీనికి తోడు ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందని, అందుకే సినిమాలు బాగా తగ్గించిందని పుకార్లు వినిపిస్తున్నాయి.