సమంత చేతికి వజ్రాల వాచీ.. ఎన్ని లక్షలో తెలుసా?

TV9 Telugu

21 April 2024

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అభిమానులను పలకరించింది సమంత. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మధ్యన సినిమా షూటింగ్ లకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది.

వరుస ఫొటోషూట్స్‌తో పాటు తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్‌‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. 

తాజాగా  మన కళ్లను మత్తెక్కించేలా  కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది సమంత. అందులో ఆమె చేతికి ఉన్న వజ్రాల పొదిగిన వాచీ స్పెషల్ ఎ‍ట్రాక్షన్‌గా నిలిచింది.

దీంతో నెటిజన్ల కళ్లన్నీ ఈ వాచీపైనే పడ్డాయి. గూగుల్ తల్లిని ఆశ్రయించి దీని బ్రాండ్, ధరెంతో తెలుసుకుందామని ట్రై చేశారు.

డైమండ్స్ పొదిగి ఉ‍న్న బల్గారీ సర్పెంటా అనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండెడ్ వాచీ ధరెంతో తెలుసా? అక్షరాలా 70 లక్షల రూపాయలు.

దీని ధరను చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. దీనిని అమ్మేస్తే లైఫ్ లో సెటిల్ కావచ్చని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.