05 November 2023
మయోసైటిస్‌తో సమంత పోరాటం.. ఎంత కష్టాన్ని భరిస్తుంది..
Pic credit - Instagram
ఖుషి తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది హీరోయిన్ సమంత. ఈమూవీ షూటింగ్ సమయంలో మరోసారి మయోసైటిస్ సమస్యతో ఇబ్బందిపడింది.
దీంతో ఈ సమస్యకు చికిత్స తీసుకోవడానికి ఆమె విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు అమెరికాలో చికిత్స తీసుకుంది హీరోయిన్ సామ్.
ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో, ఈవెంట్లలో పాల్గొంటుంది. ఇటీవల మార్వెల్ ప్రమోషన్లలో పాల్గోంది సమంత.
తాజాగా ఆమె మయోసైటిస్ సమస్యకు క్రయోథెరపీ చికిత్స చేయించుకున్నట్లు ఇన్ స్టా స్టోరీలో తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను సైతం పంచుకుంది.
దాదాపు -150 డిగ్రీల చలిలో ఉండో ఓ టబ్‌లో కూర్చున్నారు. ప్రస్తుతం ఆమె క్రయోథెరపీ చికిత్స చేయించుకుంటున్నట్ల స్టోరీలో రాసుకొచ్చారు సామ్.
క్రయోథెరపీ వల్ల తెల్ల రక్తకణాలు పెరుగుతాయని.. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మానసిక ప్రశాంతతోపాటు శక్తినిస్తుందన్నారు.
సమంత షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇటీవల ఇండోనేషియాలోని బాలీకి స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్లారు హీరోయిన్ సమంత.
ఇక ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక్కడ క్లిక్ చేయండి.