'ఫిక్స్ అయ్యా.. ఇక జీవితంలో మరెప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడను'
07 May 2025
Basha Shek
మయోసైటిస్ తో పాటు వివిధ కారణాలతో చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు 'శుభం' సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనుంది.
సమంత నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా ఇది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 09న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో సినిమా ప్రమోషన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది సమంత. ప్రెస్ మీట్లతో పాటు పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతోంది.
కాగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నాలుగేళ్లకే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు
విడాకుల తర్వాత చైతూ కానీ సమంత కానీ డైరెక్టుగా ఈ విషయంపై స్పందించలేదు. కానీ సామ్ కొన్ని సార్లు పెట్టిన పోస్టులపై ట్రోల్స్ వచ్చాయి.
అలాగే కొన్ని ఇంటర్వ్యూలు, వివిధ వేదికల్లో సమంత చేసిన కామెంట్స్ ఆమెపై తీవ్రమైన నెగెటివిటీనీ తీసుకొచ్చాయి.
ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడనని, ఈ మేరకు తాను డిసైడ్ అయినట్లు శుభం సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చింది సామ్.
సామ్ 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి కూడా చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..