ఏం వయ్యారం.. !చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. రితిక అదరగొట్టిందిగా..

21 November 2023

రితికా సింగ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం ఉన్న ఈ చిన్నది ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో భారత్ తరపున  కొన్ని మ్యాచ్ లు ఆడిన ఈ బ్యూటీ .. 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సాలా ఖదూస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రితికా సింగ్. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించింది రితిక

ఇదే సినిమా తెలుగులో గురుగా రీమేక్ అయ్యింది. ఈ సినిమాలోనూ రితిక సింగ్ హీరోయిన్ గా చేసింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. 

దాంతో రతికా పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. దాంతో పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. 

తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తు బిజీ హీరోయిన్ గా మారిపోయింది రితికా సింగ్.

ఇటీవలే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి అలరించింది.

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది.