ప్రభాస్ కల్కి సినిమాను ఎందుకు చూడాలంటే?

TV9 Telugu

26 June 2024

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ.

గురువారం (జూన్ 27) అభిమానుల భారీ అంచనాల మధ్య కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సీన్స్, వీఎఫ్‌ఎక్స్ కల్కి సినిమలో  ఉండనున్నాయి. టీజర్స్, ట్రైలర్లతోనే ఈ విషయం అర్థమైపోయింది.

బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో గ్లోబల్ స్టార్ గా తెచ్చుకున్న దీపికా పదుకొణె..  తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం

కల్కి సినిమాలో లోక నాయకుడు కమల్‌హాసన్‌ ‘సుప్రీం యాస్కిన్‌’ పాత్రలో తొలిసారి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు

నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, విజయ్ దేవరకొండ లాంటి కొందరు స్టార్ నటీనటులు కల్కి సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

హాలీవుడ్‌‌లో హ్యారీపోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ లాంటి సినిమాలకు పనిచేసిన టీమ్స్ ‘కల్కి’ సినిమా కోసం పని చేయడం మరో విశేషం.

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కల్కినేనని సినిమ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది

Reasons To Watch Prabhas Kalki 2898 AD Movie