27 November 2023

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో రష్మిక మందన్నా రోల్ ?.. 

Pic credit - Instagram

ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది రష్మిక. డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్‏ హీరోగా నటించగా.. రష్మిక కథానాయికగా నటించింది. 

ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర మాత్రం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. విజయ్ దేవరకొండ చిత్రంలో రష్మిక కీలకరోల్ పోషిస్తుందట. 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందట. 

అయితే ఈ సినిమాలో రష్మిక కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం.. ఇటీవల రష్మిక తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అని తెలుస్తోంది. 

ఢిల్లీలో ఓ చిత్రీకరణలో పాల్గొన్నా.. అదెంతో ప్రత్యేకమైనది. త్వరలోనే చెప్తా అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది రష్మిక. ఇక అదే సమయంలో మృణాల్ పోస్ట్ పెట్టేసింది. 

ఫ్యామిలీ స్టార్ చిత్రీకరణ జరుగుతుందని చెబుతూ ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఇద్దరి ఫోటోలు ఒకేలా ఉండడంతో ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నట్లు టాక్. 

దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో రష్మిక స్పెషల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. అటు పుష్ప 2 చిత్రీకరణలోను పాల్గొంటుంది హీరోయిన్ రష్మిక మందన్నా.