ఆ నటి బయోపిక్‌లో నటించాలని ఉంది: రష్మిక మందన్నా

TV9 Telugu

09 July 2024

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది కన్నడ నటి రష్మిక మందన్నా. ఇందులో శ్రీవల్లిగా ఆమె అభినయం అందరి ప్రశంసలు అందుకుంది.

పుష్ప తర్వాత రష్మిక నటించిన మరో పాన్ ఇండియా సినిమా యానిమల్. ఈ సినిమా కూడా ఏకంగా రూ. 900 కోట్లు సాధించింది.

ప్రస్తుతం ఇటు దక్షిణాది సినిమాలు, అటు హిందీ మూవీస్ షూటింగులతో ఫుల్ బిజిబిజీగా గడుపుతోంది  రష్మిక మందన్నా

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్నఒక ప్రముఖ నటి బయోపిక్‌లో నటించాలనుకుంటోంది.

ఆ నటి మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ సౌందర్య. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది రష్మిక.

కాగా సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘సౌందర్య బయోపిక్ లో నటించాలని చాలామంది హీరోయిన్లకు ఉంది. నాకు కూడా ఈ కోరిక ఉంది’ అని రష్మిక  చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, కుబేర వంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే కొన్ని లేడీ  ఓరియండెట్ మూవీస్ లోనూ నటిస్తోందీ అందాల తార.