సల్మాన్ ఖాన్‌తో సినిమా.. రష్మిక రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

24 March 2025

Basha Shek

గతేడాది పుష్ప 2, ఈ ఏడాది ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమాతో మళ్లీ మన ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయిందీ అందాల  తార.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సికందర్ సినిమా ఉగాది, రంజాన్ పండగల కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దక్షిణాది దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో సికిందర్ సినిమాలో రష్మిక మందన్నా  రెమ్యునరేషన్ కు సంబంధించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

అదేంటంటే.. సికిందర్ సినిమా కోసం రష్మిక సుమారుగా 5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకొన్నట్టు తెలిసింది

గతేడాది పుష్ప 2, ఈ ఏడాది ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

ఇప్పుడు సికిందర్ సినిమాతో రష్మిక మందన్నా కూడా దీపికా పదుకొణె, అలియా భట్ ల వరుసన చేరినట్లు తెలుస్తోంది.