నేషనల్ క్రష్ ట్యాగ్ పై రష్మిక మందన్నా సంచలన కామెంట్స్..
TV9 Telugu
Pic credit - Instagram
యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 900 కోట్లకుపై రాబట్టింది.
ఈ మూవీతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది రష్మిక. ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.
ఈ క్రమంలోనే తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్ ట్యాగ్ పై స్పందించింది రష్మిక.
నేషనల్ క్రష్ ట్యాగ్ పై రష్మిక స్పందిస్తూ.. ప్రేక్షకులు తనకు అందించిన ప్రేమకు.. తనను నటిగా అంగీకరించడానికి కారణమని.. అది బాటమ్ లైన్ అని తెలిపింది.
ఇప్పటివరకు ఉన్న నటీనటులలో నేను ఒకరిని. నేను అడియన్స్ ప్రేమను పొందుతున్నారు. మా మధ్య ఏదో అనుబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది అని తెలిపింది రష్మిక.
ప్రేక్షకులతో తనకు ఏర్పడిన బంధం.. వారి ప్రేమకు తానేప్పుడు కృతజ్ఞురాలిని అని.. నేషనల్ క్రష్ అని పిలిచిన్పపుడు ఏదో చరిత్ర ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
అలాగే కిరిక్ పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే కర్ణాటక క్రష్ గా మారింది.
ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందం మూవీతో హిట్ అందుకుంది. ఈ తర్వాత సౌత్ ఇండియా క్రష్.. తర్వాత నేషనల్ క్రష్ గా మారింది.