రష్మిక వీకెండ్‌లో ఎక్కువగా ఎవరిని కలుస్తుందో తెలుసా?

TV9 Telugu

01 April 2024

 ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రష్మిక కు పాన్ ఇండియా క్రేజ్ రాగా, రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమాతో అది కాస్తా పీక్స్ కు చేరింది.

ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 లాంటి పాన్ ఇండియా మూవీ ఉంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది.

అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ తదితర లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా రష్మిక మందన్నా చేతిలో ఉన్నాయి.

ఇలా సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉండే రష్మిక మందన్నా వీకెండ్ లో మాత్రం తనకు నచ్చినట్లు గడిపేస్తుందట.

ముఖ్యంగా తన స్నేహితులతోనే టైమ్ ఎక్కువగా స్పెండ్ చేస్తుందట. కుటుంబ సభ్యులకూ తగిన సమయం కేటాయిస్తుందట.

కేవలం వీకెండ్స్ లోనూ సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం దొరికినా ఫ్రెండ్స్ తో జాలితో గడిపేందుకే ఎక్కవగా ప్రాధాన్యమిస్తుందట రష్మిక.

నేషనల్ క్రష్ నటించిన పుష్ప 2 ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.